Song | Akasam Enatido |
చిత్రం. | నిరీక్షణ (1982) |
సంగీతం | ఇలయరాజ |
గానం | జానకి |
రచన | ఆత్రేయ |
నటులు | భాను చందర్, అర్చన |
దర్శకుడు | బాలు మహేంద్ర |
Akasam Enatido Naa Song
Akasam Enatido Song Lyrics
లాలాల లాలాలల లాలాల లాలాలల
లాలాల లాలాల లలలల లాలాల లాలాలల
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ మేఘం ఏ వానచినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా
మోహాలే దాహాలై సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది